ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 31:
మెదక్ జిల్లా (30) జిల్లాలోని హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటీస్ ఫౌండేషన్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. హోటల్, ఫుడ్, హాస్పిటాలిటీ, మార్కెటింగ్, ఫుడ్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీ, హెచ్‌ఆర్, అకౌంట్స్ తదితర రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఆపరేషన్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్, డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిక్యూటివ్, మెయింటెనెన్స్ మేనేజర్, మెయింటెనెన్స్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ ఇన్‌చార్జ్, స్టోర్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ ఇన్‌చార్జ్, క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ జూనియర్ ఎగ్జిక్యూటివ్, హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, కుక్స్/షెఫ్స్, ఐటీ ఎగ్జిక్యూటివ్, ప్రొక్యూర్‌మెంట్/పర్చేజ్, అకౌంట్స్ తదితర పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు సంబంధిత విద్యార్హతలతో పాటు పోస్టును బట్టి ఒక సంవత్సరం నుంచి 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. వయోపరిమితి 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు అర్హత, అనుభవాన్ని బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.80,000 వరకు వేతనం అందజేస్తారని, కుక్స్/షెఫ్స్ పోస్టులకు అనుభవాన్ని బట్టి ప్రత్యేకంగా వేతనం నిర్ణయిస్తారని వెల్లడించారు. అన్ని పోస్టులకు విధి నిర్వహణ స్థలం మెదక్‌గా ఉంటుందని తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఆగస్టు 3, 2026 (సోమవారం) మెదక్ ప్రైవేట్ ఐటీఐ (సబ్ స్టేషన్ ఎదురుగా)లో నిర్వహించే ఉద్యోగ మేళాకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 93724 78535 నంబర్‌ను సంప్రదించాలని హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటీస్ ఫౌండేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.