సత్యసాయి ఆగ్రో రైస్ మిల్లులో భారీ అవకతవకలు.. రూ.7.17 కోట్ల విలువైన ధాన్యం గల్లంతు
A2న్యూస్, జూలై 22, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (21) మెదక్ జిల్లా కుల్చారం మండలంలోని శ్రీ సత్యసాయి ఆగ్రో రైస్ మిల్ ఇండస్ట్రీస్‌లో అధికారులు నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో భారీ స్థాయిలో ధాన్యం కొరత బయటపడింది. ఈ విషయాన్ని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ బృందం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, అసిస్టెంట్ పౌర సరఫరాల అధికారి, సివిల్ సప్లై ఇన్‌స్పెక్టర్‌లు సంయుక్తంగా జూలై 20న రైస్ మిల్లును...