ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు యాంటీ ర్యాగింగ్ కమిటీలను సమర్థవంతంగా నిర్వహించాలి: మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, జులై 8, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (7) కళాశాలలు, హాస్టళ్లు ప్రారంభమైన నేపథ్యంలో నూతనంగా చేరిన విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. ర్యాగింగ్ అనేది చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని పేర్కొన్న ఆయన, విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు ఏమాత్రం అవకాశం లేకుండా యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, అవమానించడం, శారీరక లేదా మానసిక వేధింపులకు పాల్పడడం వంటి చర్యలు...