ప్రేమ పేరుతో వేధిస్తే జైలుకే!” “నిందితుడికి 2 ఏళ్ల జైలు..20 వేల జరిమానా”
A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (13) పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలంటూ వెంటపడి వేధించిన నిందితుడికి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. వెల్దుర్తి మండలానికి చెందిన 27 ఏళ్ల నరేష్ పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలంటూ కొంతకాలంగా వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు వెల్దుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూదన్ గౌడ్ 2022 జూలైలో కేసు...