A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 6:35 am Posted by : A2TV NEWS

విస్తరిస్తున్న ఆన్లైన్ షాపింగ్ రికార్డు స్థాయిలో దసరా కొనుగోళ్లు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 21:

నర్సాపూర్ (20) ఆన్లైన్ షాపింగ్ పెద్ద నగరాల నుండి ప్రారంభమై రోజురోజుకు పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విస్తరిస్తూ కొనుగోళ్లలో ఈసారి రికార్డు స్థాయిలో నిలిచింది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా నచ్చిన బట్టలను నచ్చిన రంగును ఇందులోనే సెలెక్ట్ చేసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ సంస్థల సేవలు గ్రామాలకు సైతం విస్తరించడం కలిసి వచ్చిందని చెప్పాలి. 2026 దసరా పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ అతిపెద్ద వార్షిక సేల్స్ ద్వారా భారీ ఆఫర్లను అందించాయి. ఇదే ఊపు దీపావళి పండుగ వరకు కొనసాగనున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. రెడ్‌సీర్ నివేదికల ప్రకారం ఈ పండుగ సీజన్ ప్రారంభమైన కేవలం మొదటి రెండు రోజుల్లోనే సుమారు 24 వేల కోట్ల విలువైన ఆన్‌లైన్ వ్యాపారం జరిగి సరికొత్త రికార్డు సృష్టించింది. దీపావళి వరకు ఇది మరింత రికార్డు స్థాయికి వెళ్తుందటంలో ఏమాత్రం సందేహం లేదు. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ పేరిట అక్టోబర్ 8న ప్రారంభమైన ఈ సేల్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, మరియు ఎలక్ట్రానిక్స్‌పై గరిష్టంగా 80% వరకు తగ్గింపు అదనంగా, SBI క్రెడిట్/డెబిట్ కార్డులపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇలా పేరిట ఆఫర్ ప్రకటించింది. ఇక కొనుగోలు ఆశించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో ఊపందుకున్నాయి. ఇక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, బిగ్ షాపింగ్ ఉత్సవ్ పేరిట అక్టోబర్ 9 నుండి లైవ్‌లోకి వచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్స్ మరియు ఫ్యాషన్ ఉత్పత్తులపై 80% నుండి 90% వరకు భారీ తగ్గింపులు ఇస్తున్నారు. బ్యాంక్ కార్డులపై 10% అదనపు తగ్గింపు తో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే స్నాప్డీల్, మీ షో, మైత్రా లాంటి ఈ కామర్ సంస్థలు సైతం ఈసారి మంచి మంచి ఉత్పత్తులతో ఆకట్టుకునే ఆఫర్లతో మార్కెట్ రంగంలో తమదైన ముద్ర వేసి దసరాకి దేశవ్యాప్తంగా 24వేల కోట్ల రూపాయల మార్కెట్కు చేరుకోవడం ఈసారి రికార్డు స్థాయి ధర. ఇంకా దీపావళి వరకు ఎలాంటి ఆఫర్లతో మార్కెట్ ను కొల్లగొట్టనుందో చూడాలి.