ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 82 దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజలు అందజేసిన వినతులు, ఫిర్యాదులను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి,...