జూలై 1 నుంచి చెత్తను నాలుగు విభాగాలుగా వేరు చేసి ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్-2026 అమలుకు కార్యాచరణ – అన్ని శాఖల సమన్వయంతో పరిశుభ్ర జిల్లానే లక్ష్యం A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (27)జిల్లాలో జూలై 1వ తేదీ నుంచి ఘన వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేసి సేకరించే విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)పై సమీక్ష సమావేశంలో ఆమె ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ...