A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 25:
మెదక్ జిల్లా (24) హవేలి ఘనపూర్ మండలం కూచన్‌పల్లి గ్రామంలో శ్రీ బాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ ప్రసాదం వేలం పాటలో మన్నె రాజు కుమార్ రూ.20,000లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలం పాట కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం శ్రీ బాలాజీ గణేష్ మండలి అధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. మండలి సభ్యులు నరసింహ చారి, బాలరాజు, బ్రహ్మంతో పాటు పలువురు భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.