గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.. డీజేలకు అనుమతి లేదు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 13: మెదక్: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మెదక్ టౌన్, మెదక్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్లకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులతో జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాల ఏర్పాటు, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శబ్ద కాలుష్యం, నిమజ్జనం...