వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం
... పాల్గొన్న తహసిల్దార్ శ్రీనివాస చారి .. ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) (బుజ్జన్న) సెప్టెంబర్ 19: కుల్చారం (18) మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన శ్రీ హనుమాన్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, స్థానిక భక్తులతో పాటు తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్సై మొయినుద్దీన్, విద్యుత్ కార్యాలయ సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు వచ్చి గణనాథుని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. అనంతరం స్థానిక తహసిల్దార్ శ్రీనివాసచారిని...