A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:58 am Posted by : A2TV NEWS

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం

… పాల్గొన్న తహసిల్దార్ శ్రీనివాస చారి 

.. ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్

A2న్యూస్, నర్సాపూర్ (కొల్చారం) (బుజ్జన్న) సెప్టెంబర్ 19:

కుల్చారం (18) మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన శ్రీ హనుమాన్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులు, స్థానిక భక్తులతో పాటు తహసిల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్సై మొయినుద్దీన్, విద్యుత్ కార్యాలయ సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు వచ్చి గణనాథుని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు. అనంతరం స్థానిక తహసిల్దార్ శ్రీనివాసచారిని ఎస్సై మొహినోద్దీన్ లను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, సంగమేశ్వర్ మాట్లాడుతూ గణనాథుని కృప కటాక్షం ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరారు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న వర్షాభావ పరిస్థితులను అధిగమించి పచ్చని పంటలతో గ్రామాలు వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, పాండ్ర వెంకటేశం, తిమ్మనగారి ఆంజనేయులు, పట్లూరి నరసింహులు, మనోహర్, అఖిల్, రితిన్, సత్యనారాయణ, తెనుగు శేఖర్, రామా గౌడ్, శేఖర్, సారా రామకృష్ణ, శ్రీధర్, నరసింహులు, వడ్ల శివ, సుదర్శన్, దుర్గాప్రసాద్ గౌడ్, అనిల్, శ్రీధర్, చిన్న రాములు, చెన్నయ్య, ఆనంద్, పాండ్ర శ్రీనివాస్, శ్రీశైలం, నాగరాజ్, శేఖర్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, రాజు, వంశీ, సంపత్, శివ, లంబాడి శ్రీనివాస్, ప్రవీణ్, రామ్, కుమ్మరి నాగరాజ్, సంజీవులు, మండప నిర్వాహకులు తదితరులు పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.