రైతులు యూరియా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 19, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా: రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. రైతులు యూరియా యాప్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకుని, నిర్ణీత సమయానికి డీలర్ల వద్ద నుంచి ఎరువును పొందాలని సూచించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, యూరియా కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని తెలిపారు. రైతులు ఇంటి వద్ద నుంచే యాప్ ద్వారా...