A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:06 am Posted by : A2TV NEWS

రైతు శిక్షణ కార్యక్రమం ..

రైతులకు ఆర్‌పీఎల్ శిక్షణతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన

A2న్యూస్ నర్సాపూర్  (కొల్చారం)ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 11:

కూల్చారం (10) మండలం: ఆత్మా ఆధ్వర్యంలో రైతు వేదిక, కూల్చారం గ్రామంలో ఆర్‌పీఎల్ (రేకగ్నేషన్ ఆఫ్ ప్రియర్ లర్నింగ్ ) ఆధారిత రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, పంటల సాగులో పాటించాల్సిన సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు, పురుగు–తెగుళ్ల నివారణ, ఎరువుల సమతుల్య వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో రైతుల ప్రస్తుత పరిజ్ఞానాన్ని గుర్తించి, అవసరమైన అంశాలపై మరింత సాంకేతిక పరిజ్ఞానం అందించారు. కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ రవి కుమార్ రెడ్డి డాక్టర్ ప్రతాప్ రెడ్డిమరియు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల వారీగా సలహాలు, సూచనలు అందించారు. రైతులు శిక్షణలో నేర్చుకున్న సాంకేతిక పద్ధతులను తమ పొలాల్లో అమలు చేసి ఉత్పాదకత పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకోవాలని అధికారులు సూచించారు. శిక్షణ అనంతరం రైతులకు ధ్రువపత్రాలు అందజేశారు. ఆర్‌పీఎల్ శిక్షణకార్యక్రమాల ద్వారా రైతుల నైపుణ్యాలను గుర్తించి, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా రైతుల సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే వరి పంటలు పరిశీలించడం జరిగింది వరిలో ప్రస్తుతం కాండం తొలిచే పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్నది దానికి క్లోరంత్రానిలిప్రోల్ 90 ఎంఎల్/ఎకరాకు మరియు రైతు నర్సిములు పొలంలో లీఫ్ మైట్, కంకి నల్లి మరియు అగ్గి తెగులు గుర్తించడం జరిగింది దానికి గాను సైంటిస్ట్లు ఓబెరాన్ ( స్పిరో మెఫ్సిఫిన్) @ 200 ఎమ్మెల్ /ఎక్కడ + టిల్ట్ ( ట్రాఫికో నజోల్) @ 200 ఎమ్మెల్/ఎకరాకు పిచికారి చేయాలి.