పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత:జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 5: మెదక్ జిల్లా (4) పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. మంగళవారం హవేలీఘనాపూర్ మండలంలోని పోచారం అభయారణ్యాన్ని ఆయన సందర్శించారు. అనంతరం పోచారం డ్యాంలో వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భావితరాలకు మెరుగైన భవిష్యత్తును అందించవచ్చని అన్నారు. ప్రకృతిని కాపాడినప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. జీవ వైవిధ్యం మానవ మనుగడకు ఆధారమని, పర్యావరణ...