A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 6:36 am Posted by : A2TV NEWS

శారీరక దృఢత్వంతోనే సమర్థవంతమైన విధుల నిర్వహణ

క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వర్తించాలి: డీఎస్పీ ప్రసన్న కుమార్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 :

మెదక్ జిల్లా (24) పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు డీఎస్పీ ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది పరేడ్‌లో పాల్గొన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, సమయపాలన, విధుల పట్ల నిబద్ధత అత్యంత కీలకమని డీఎస్పీ పేర్కొన్నారు.

సిబ్బంది క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో పరస్పర సమన్వయం, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఆర్‌ఐ శైలేందర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.