సాంకేతికతతో సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలి..
రాష్ట్ర పోలీసు అధికారులతో డీజీపీ సి.వి. ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ A2 న్యూస్, జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (3) సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఈ...