వరి వద్దు.. ఆరుతడి పంటలే వేయండి
ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంతో రైతులు అధిక ఆదాయం పొందాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 28: కౌడిపల్లి,(27) ప్రస్తుత ఎల్‌నినో (వర్షాభావ) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక నీటి అవసరమున్న వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను రైతులు విస్తృతంగా సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విత్తన మేళాలను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని...