కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన డీఎంహెచ్‌వో డా. గణేశ్వర్

A2న్యూస్, జులై 18, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) వెల్దుర్తి (17) వెల్దుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డా. గణేశ్వర్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించి విద్యార్థినులతో ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల నివారణపై అవగాహన కల్పించారు. వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, వాంతులు, విరేచనాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కలుషిత ఆహారం, నీరు తీసుకోకుండా వేడి ఆహారం...