మెదక్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని సాధించాలి అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 17:   మెదక్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలో సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి గృహనిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన గూగుల్‌ మీట్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మొదటి, రెండో విడతల్లో మంజూరైనప్పటికీ ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్లను గుర్తించి, వాటి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి, వారికి అవగాహన కల్పించడంతో పాటు...