A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 12 :
నర్సాపూర్ (11) మండల పరిధిలోని చిన్న చింతకుంట గ్రామం లో గల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ప్రభుత్వం సరఫరా చెసిన యూనిఫాం మరియు బూట్లు గ్రామ సర్పంచ్ సరిత మహేష్ చేతులమీధుగావిద్యార్థులుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కల్పన, ఉప సర్పంచ్ పెంటయ్య, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, శ్రీకాంత్ రెడ్డి, శివయ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.