A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 6:28 am Posted by : A2TV NEWS

అదనపు కలెక్టర్ నగేష్‌కు ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ

A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (4) సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌కు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఎన్యుమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్హుడిని ఓటరు జాబితాలో నమోదు చేసేలా విస్తృత అవగాహన కల్పించి, ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతను తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ తహసీల్దార్ సింధు రేణుకతో పాటు సంబంధిత అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు.