విధుల్లో అప్రమత్తతతో పాటు క్రమశిక్షణ పాటించాలి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి – ఎస్పీ శ్రీనివాస రావు

చేగుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా ఎస్పీ A2న్యూస్, జూలై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) చేగుంట(16) మెదక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) డి.వి. శ్రీనివాస రావు గురువారం చేగుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, రిసెప్షన్ విధులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను నాణ్యతతో, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన...