ఆధార్‌లో వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి – జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 28: మెదక్ జిల్లా (27)  జిల్లా కేంద్రం, సోమవారం: ప్రతి పౌరుడు తమ ఆధార్‌లోని వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకుని అవసరమైన సవరణలు, నవీకరణలు తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ-డిస్ట్రిక్ట్ అధికారులు, ఆధార్ నమోదు కేంద్రాల నిర్వాహకులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే ఆధార్‌లో పేరు, జన్మతేదీ, చిరునామా, మొబైల్ నంబర్,...