పెయింటర్ కనిగిరి సుదర్శన్ మృతి.. గ్రామంలో విషాదం

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) ఆగస్టు 26 : మనోహరాబాద్ (25) కాళ్లకల్ గ్రామానికి చెందిన ప్రముఖ పెయింటర్ కనిగిరి సుదర్శన్ (56) అనారోగ్యంతో మృతి చెందారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి గ్రామస్తులు, స్నేహితులు, ఆత్మీయులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. కనిగిరి సుదర్శన్ గత 30 ఏళ్లుగా పెయింటింగ్ వృత్తిని కొనసాగిస్తూ గ్రామంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామంలో పెయింటింగ్ కళలో ఆయనకు ప్రత్యేక స్థానం...