A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 5:56 am Posted by : A2TV NEWS

డామిట్ కథ అడ్డం తిరిగింది…!

పామును కరిచిన కప్ప 

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) ఆగస్ట్ 4:

నర్సాపూర్ (3) ఒక్కోసారి కథ అడ్డం తిరిగితే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టుగానే ఉంటుందేమో? సాధారణంగాజర్నలిజంలో ఒక సూత్రం ఉంటుంది. అదేంటంటే మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు మనిషి కుక్కని కరిస్తే వార్త, పాము కప్పని మింగితే వార్త కాదు కప్ప పాముని మింగితే వార్త అనేది. ఈ చిత్రం దానికి అసలైన ఉదాహరణగా నిలుస్తుంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పాము కప్పను చూడగానే మింగుదామని అనుకుందేమో దాని దగ్గరికి రాగా కప్పకు చిరెత్తుకొచ్చిందో ఏమో ఏకంగా పాము పైనే తిరగబడి మరీ కరిచింది. దీంతో పాము తొకముడిచి చేసేదేం కప్పబారి నుండి విడిపించుకునివెళ్ళిపోయింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది.