యూరియా బుకింగ్ యాప్‌లో సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలి
— జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6:
మెదక్ జిల్లా (5) జిల్లాలో పంట నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే మండల కేంద్రాల్లో యూరియా బుకింగ్ యాప్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నమోదు, రైతులకు ఎరువుల సరఫరాపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంట నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లోని వాలంటీర్ల ద్వారా మాత్రమే పంట నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు రైతుల పంట నమోదు ప్రక్రియ 75 శాతం పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన నమోదును కూడా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా జిల్లాలోని మండల కేంద్రాల్లో యూరియా బుకింగ్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సరైన సమయంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్, వినయ్, వందనతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.