కానిస్టేబుల్ మహిపాల్ కుటుంబానికి ఎస్పీ అండ
4.21 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేత మహిపాల్ భార్యకు ఉద్యోగం వచ్చేలా చర్యలు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12 : మెదక్ జిల్లా (11) విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివంపేట పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ మహిపాల్ కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి సేకరించిన రూ.4.21 లక్షల ఆర్థిక సాయం చెక్కును...