ప్రతి గ్రామంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి..
రోడ్డు ప్రమాదాలు, సైబర్-ఆర్థిక నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి– మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, జులై 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (14) జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసులో వేగవంతంగా, నాణ్యమైన దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్,...