A2న్యూస్, మెదక్ ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23:
మెదక్ జిల్లా (22) ఇదేదో సినిమా డైలాగ్ అని తేలికగా తీసుకోకండి కాస్త ఆలోచించండి. మనం కరెంట్ బిల్లు, ఏటీఎం బిల్లు అలాగే మనం షాపింగ్ చేసేటప్పుడు ఇచ్చే బిల్లులు ఇస్తారు గమనించారా వాటిని మనం తేలిగ్గా తీసుకుంటాం కానీ వాటిని ముట్టుకొని చేతులు శుభ్రంగా కడుక్కోకపోతే మాత్రం రంగు పడడమే మన చేతికి అంటడమే కాకుండా బిల్లు ప్రింట్ కోటింగ్ లో ఉండే హానికర రసాయనాలతో మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిల్లులో ప్రింటు మరింత వచ్చేందుకు హానికర రసాయనాలు కలపడం అని వార్యమట. మనం సాధారణంగా ఈ బిల్లులు షాపింగ్ చేయగానే వీటిని మనం తేలిగా తీసుకొని పడేయడమో లేకపోతే దేనికైనా అవసరం వస్తాయని దాచి పెట్టుకోవడం సర్వసాధారణం. కానీ దీంట్లో ఉండే హానికర రసాయనాల తో కూడిన ఇంకు వాడటం వల్ల వాటిని మనం ఏమాత్రం ఆ జాగ్రత్త గా ముట్టుకున్న రోగాలు తప్పవని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిని ముట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుకోవాలని లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం తప్పదని మరీ సూచిస్తున్నారు. ఇకనైనా అలాంటి హానికర రంగులకు దూరంగా ఉందాం మనఆరోగ్యాలను కాపాడుకుందాం. అందరూ ఈ దిశగా ఆలోచించి వాటితో జాగ్రత్త ఉండడం ఎంతైనా అవసరం.