ఉపాధ్యాయురాలిగా మారిన కలెక్టర్ ప్రతిమా సింగ్

విద్యార్థులకు పాఠాలు బోధించి సామర్థ్యాలు పరిశీలించిన కలెక్టర్ అన్ని కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలి భోజనం–చదువు–క్రీడలు ప్రతి విద్యార్థి దినచర్యలో భాగం కావాలి A2న్యూస్, జూలై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) చేగుంట (25) విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణను అలవాటు చేసుకుంటేనే భవిష్యత్తు బంగారుమయం అవుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. శనివారం చేగుంట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆమె సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. ముందుగా 6, 7వ తరగతి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను...