A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:29 am Posted by : A2TV NEWS

కరాటేలో మెరిసిన నిత్యశ్రీకి కలెక్టర్ అభినందనలు

16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్.. 4 ఛాంపియన్‌షిప్‌లు సాధించిన విద్యార్థిని

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 10 :

మెదక్ జిల్లా (9) కరాటేలో ప్రతిభ చాటుతూ 16 స్టేట్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌తో పాటు నాలుగు ఛాంపియన్‌షిప్‌లు సాధించిన మెదక్ పట్టణానికి చెందిన విద్యార్థిని నిత్యశ్రీని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆమెను శాలువాతో సత్కరించి, ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యశ్రీ సాధించిన విజయాలు అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. తన విజయాల వెనుక కరాటే శిక్షకుడు నగేష్ మల్లూరి అందించిన శిక్షణ, ప్రోత్సాహం ఎంతో ఉందని నిత్యశ్రీ తెలిపారు. ఆయన సారథ్యంలో శిక్షణ తీసుకుంటూ పలు పతకాలు సాధించానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ బ్రూస్లీ ఐకాన్ అవార్డును సైతం సొంతం చేసుకున్నట్లు నిత్యశ్రీ వెల్లడించారు.