A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 6:56 am Posted by : A2TV NEWS

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి: కొత్తపేట సర్పంచ్ నింగర బోయిన రాములు

A2న్యూస్, శివంపేట్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 12 :

శివంపేట్ (11) పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెదక్ జిల్లా శివంపేట మండలం కొత్తపేట గ్రామ సర్పంచ్ నింగర బోయిన రాములు అన్నారు. శుక్రవారం కొత్తపేట గ్రామంలో గ్రామ ప్రజలకు నాలుగు రకాల చెత్తబుట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సహకరించాలని సూచించారు. ముఖ్యంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.