పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2: మెదక్ (1) పరిశుభ్రత అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరి దైనందిన బాధ్యత అని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫటీగ్ డ్యూటీలో భాగంగా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది స్టేషన్ ఆవరణలు, కార్యాలయ పరిసరాలు, రికార్డు గదులు, సందర్శకులు వేచి ఉండే ప్రదేశాలు, పార్కింగ్...