వసతి గృహాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, జూలై 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) చిన్న శంకరంపేట (23) వసతి గృహాల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు. గురువారం చిన్న శంకరంపేట మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా షెడ్యూల్ కులాల (ఎస్సీ) బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ విధానం, పరిశుభ్రతను తనిఖీ చేశారు....