A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 9:41 pm Posted by : A2TV NEWS

పోలీస్ స్టేషన్లలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం ఫైళ్లు, రికార్డుల క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 17:

 

మెదక్: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌ను శుభ్రం చేయడంతో పాటు, పోలీస్ స్టేషన్ల ఆవరణల్లో చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్లలో ఫైళ్లు, రికార్డులను క్రమబద్ధీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా 5ఎస్‌ విధానాన్ని అమలు చేస్తూ అవసరమైన రికార్డులను వర్గీకరించడం, ఫైళ్లను సులభంగా గుర్తించేలా అమర్చడం, కార్యాలయ గదులు, ఫర్నిచర్‌, ఫైళ్ల అల్మారాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. రికార్డుల నిర్వహణలో నిర్దిష్ట ప్రమాణాలను పాటిస్తూ కార్యాలయాలను మరింత క్రమబద్ధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీస్ కార్యాలయాలను పరిశుభ్రంగా, క్రమపద్ధతిలో నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ పరిశుభ్రత, క్రమబద్ధీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.