A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 7:04 am Posted by : A2TV NEWS

తూప్రాన్‌లో నాలుగు కల్లు దుకాణాలపై తనిఖీలు నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలంగా గుర్తింపు

A2న్యూస్, తూప్రాన్ ప్రతినిధి (పెద్దింటి సత్యం ) సెప్టెంబర్ 11:

తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నిన్న రాత్రి ఈగల్ ఫోర్స్ మరియు మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు కల్లు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారుతనిఖీలలో కల్లులో నిషేధిత మత్తు పదార్థం (ఆల్ఫాజోలం )ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ మేరకు సంబంధిత నాలుగు కల్లు దుకాణాల్లో సేల్స్‌మెన్‌లుగా పనిచేస్తున్న కొత్తపల్లి నర్సింహారావు, మాదాసు శ్రీనివాస్ గౌడ్, పంజాల దుర్గాగౌడ్, జాలిగామ సిద్ధిరాములులపై కేసులు నమోదు చేశారు.అలాగే సంబంధిత కల్లు దుకాణాల యజమాని రామకృష్ణ మరియు కల్లు సరఫరాదారు శ్రీనివాస్ గౌడ్, ప్రకాష్ గౌడ్ పరారీలో ఉన్నారు మొత్తం ఏడుగురిపై యేసు నమోదు గురువారం రోజు నలుగురిని అరెస్టు చేసి రోడ్డులో హాజరు పరిచినట్లు తెలిపారు. నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం కల్లులో కలపడం, అక్రమంగా సరఫరా చేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.