ఓటరు జాబితాలో వివరాలు సరిచూసుకోవాలి: ఆర్‌డీవో రమాదేవి
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 28: మెదక్ జిల్లా (27) ఓటర్ జాబితాలో నమోదైన తమ వివరాలను ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని ఆర్‌డీవో రమాదేవి సూచించారు. గురువారం మెదక్ పట్టణంలోని 133, 134 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితాలో వివరాల పరిశీలన, సవరణలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో రమాదేవి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన అర్హులైన యువతీ యువకులు కొత్త ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు....