విఘ్నేశ్వరుని కృపతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

గణేష్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 14: మెదక్ జిల్లా (13) గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. గణపతి ఆశీర్వాదాలతో జిల్లాలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని,...