A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 6:55 am Posted by : A2TV NEWS

దళిత సంఘాల ఆధ్వర్యంలో అమరప్రసాద్ దిష్టి బొమ్మ దహనం

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) సెప్టెంబర్ 17:

నర్సాపూర్ (16) దళితద్రోహిఅయినటువంటి అమర ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేసి ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ లో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. అమర ప్రసాద్ ఒక దళిత వారసుడై దళితులకు వెన్నుపోటు పొడుస్తున్న ఈ దళిత ద్రోహి అని అతను మాట్లాడిన మాటలు వింటా ఉంటే దళిత ప్రజలు చాలా బావొద్వేనికిగురవుతున్నారని మండి పడ్డారు. భారత రాజ్యా ంగానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా రాసినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మార్పీఎస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి జమునగల్ల కుమార్, మాల మహానాడు యువజన సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు దాడిగ నరేష్, ఎం.ఎస్.ఎఫ్ మెదక్ జిల్లా కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు విద్య సాగర్, నరేష్, మన్నే ప్రకాష్, మహేష్,యాదగిరి, కలవగడ్డ కుమార్ తదితరులు పాల్గొన్నారు.