1000 రోజుల పాలనలో బాకీ పడ్డ హామీలపై బీఆర్ఎస్ ప్రచారం

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి ( జల్లి రామకృష్ణ)సెప్టెంబర్ 7: మనోహరాబాద్ (6) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చని ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజలకు తెలియజేసేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేయకుండా, 1000 రోజుల పాలనలో ప్రజలను...