A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 6:36 am Posted by : A2TV NEWS

1000 రోజుల పాలనలో బాకీ పడ్డ హామీలపై బీఆర్ఎస్ ప్రచారం

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి ( జల్లి రామకృష్ణ)సెప్టెంబర్ 7:

మనోహరాబాద్ (6) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చని ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలను ప్రజలకు తెలియజేసేందుకు ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేయకుండా, 1000 రోజుల పాలనలో ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పార్టీ నాయకులు నరాల రమేష్, లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, వెంకటేష్, అరుణ్ కుమార్, నవీన్, నాగేష్, శంకర్ రెడ్డి, బిక్షపతి రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.