వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి
మండపాల నిర్వాహకులతో సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు చర్యలు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 8: మెదక్ జిల్లా ( 7) వినాయక చవితి, గణేష్ నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం...