ప్రజావాణికి ఎనిమిది దరఖాస్తులు

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 8: మనోహరాబాద్ (7) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దండుపల్లి గ్రామానికి చెందిన నర్సింలు ప్రొహిబిటెడ్‌ ప్రాపర్టీ జాబితా నుంచి భూమిని తొలగించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. కాళ్లకల్‌ గ్రామానికి చెందిన పి.సత్యం సర్వే నంబర్లు 368, 369కు సంబంధించిన సర్వే చేయాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు....