A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 7:10 am Posted by : A2TV NEWS

యాప్‌లో బుక్ చేసుకోండి.. క్యూ లైన్లు అవసరం లేదు

మెదక్ జిల్లాలో యూరియా కొరత లేదన్న కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్‌లో 3,617 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో

A2 న్యూస్, జులై 3, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (2) జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. యూరియా కోసం ఎరువుల దుకాణాల వద్ద భారీ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని తమకు సమీపంలోని డీలర్ పాయింట్‌లో ఎరువులను పొందవచ్చని సూచించారు.జిల్లాలో ప్రస్తుతం ప్రైవేట్ డీలర్లు, మార్క్‌ఫెడ్ గోదాముల్లో కలిపి 3,617 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి మండలంలో రెండు నుంచి మూడు డీలర్ పాయింట్ల వద్ద యూరియా నిల్వలు ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు జిల్లాలో 53,297 మంది రైతులు 5,706 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అవసరమైన మేరకు యూరియా నిల్వలు ఉండటంతో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, ప్రశాంతంగా యాప్ ద్వారా బుక్ చేసుకుని ఎరువులు పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.