స్వచ్ఛత హీ సేవలో భాగంగా మద్దుల చెరువు సుందరీకరణ

సేవ్ నేచర్ – సేవ్ ప్లానెట్’ థీమ్‌తో దండుపల్లిలో ప్రత్యేక కార్యక్రమం A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 20: మనోహరాబాద్ (19) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో శనివారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మద్దుల చెరువు పరిసరాలను శుభ్రపరిచి, ‘సేవ్ నేచర్ – సేవ్ ప్లానెట్’ థీమ్‌తో సుందరీకరణ పనులు చేపట్టారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో, ఎంపీడీవో ప్రీతి...