సేవ్ నేచర్ – సేవ్ ప్లానెట్’ థీమ్‌తో దండుపల్లిలో ప్రత్యేక కార్యక్రమం
A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 20:
మనోహరాబాద్ (19) మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో శనివారం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మద్దుల చెరువు పరిసరాలను శుభ్రపరిచి, ‘సేవ్ నేచర్ – సేవ్ ప్లానెట్’ థీమ్‌తో సుందరీకరణ పనులు చేపట్టారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో, ఎంపీడీవో ప్రీతి రెడ్డి, ఎంపీవో, గ్రామ సర్పంచ్ మరాటి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి హేమలత, ఉప సర్పంచ్ నాగమణి వెంకటేష్, వార్డు సభ్యులు సురేష్ కుమార్, దీపిక, ఎల్లేష్, స్వాతి, రాజు, నరేష్, ఉదయ్ గౌడ్, మనీషా, కొయిరాల సురేష్ కుమార్, స్వరూప, యాదగిరి పాల్గొన్నారు.
అలాగే గ్రామ పెద్ద పంజా బిక్షపతి, గ్రామ యువత, మహిళలు, గ్రామస్థాయి అధికారులు, ఐటీసీ సభ్యులు రసూల్‌తో పాటు వారి బృందం కార్యక్రమంలో పాల్గొని చెరువు పరిసరాల శుభ్రత, సుందరీకరణ పనుల్లో భాగస్వాములయ్యారు. పరిశుభ్రతతో పాటు ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.