మెదక్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 16: మెదక్: పూలను దైవాలుగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ గౌరీమాతకు పూజలు నిర్వహించారు....