A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 10:18 pm Posted by : A2TV NEWS

మెదక్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 16:

మెదక్: పూలను దైవాలుగా కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వివిధ శాఖల సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ గౌరీమాతకు పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, మహిళల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. బతుకమ్మ, బోనాల పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాలని సూచించారు.బతుకమ్మల అలంకరణలో డీఆర్‌డీఓ విభాగం ప్రథమ స్థానం, జిల్లా సంక్షేమ శాఖ ద్వితీయ స్థానం సాధించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.