విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై అవగాహన
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 4: మెదక్ (3) భూపతిపూర్, సెప్టెంబర్ 4: ఎబిసి 3.0 (Awareness • Behaviour • Campaign) కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా భూపతిపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైఫ్ స్కిల్స్ ట్రైనర్, ఎబిసి 3.0 ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి సునీత రాకేష్ కొర్రపాటి విద్యార్థులతో ఇంటరాక్టివ్‌గా సంభాషించారు....