A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 6:41 am Posted by : A2TV NEWS

విలేకరులపై దాడులను సహించేది లేదు

మెతుకు సీమ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిక్షపతి

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 2:

నర్సాపూర్ (1) విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదని మెతుకు సీమ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బిక్షపతి అన్నారు. ఆయన నర్సాపూర్ లో మాట్లాడుతూ అక్రమాలను వెలుగులోకి తెచ్చేజర్నలిస్టులపై దాడులు ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. చిన్న చింతకుంట గ్రామానికి చెందిన సురేష్ గౌడ్ అక్రమంగాఇసుకతరలిస్తున్నారనే పక్కా సమాచారంతో సాక్ష్యం విలేకరి భరత్ భూషణ్ గౌడ్ సంబంధిత ఆధారాలతో సహా నర్సాపూర్ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి, అక్రమంగాఇసుకతరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాక్టర్‌పై చర్యలు తీసుకోగా ఈ ఘటనను మనసులో పెట్టుకున్న ట్రాక్టర్ యజమాని సురేష్ గౌడ్, అక్టోబర్ 1వ తేదీకి ముందు అర్ధరాత్రి సుమారు 11:30 గంటల సమయంలో నర్సాపూర్‌లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుసమీపంలోకి నెక్సాన్ కారులో వచ్చి భరత్ భూషణ్ గౌడ్‌పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయమై గురువారం నర్సాపూర్ సీఐ రంగకృష్ణ, ఎస్సై రంజిత్ రెడ్డిని కలిసి దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేసి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు.